అంతర్జాతీయం

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు-- ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, జూలై 11: భారీ వర్షాలు వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లో ఏడుగురు మృతిచెందినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. డెహ్రాడూన్ జిల్లాలోని శాస్ర్తీనగర్‌లో కొండవాలును ఉన్న ఓ ఇంటిపై మట్టిపెళ్ళలు విరిగి పడడంతో అందులో నివసిస్తున్న వారిలో నలుగురు మృతిచెందారు. వారిలో ఒక మహిళ, బాలుడు ఉన్నారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (ఎస్‌ఈఓసీ) తెలిసింది. ఇదే సంఘటనలో గాయపడ్డ ఇద్దరు పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వికాస్‌నగర్‌కు సమీపంలోని చార్‌బా గ్రామం వద్ద షీత్‌లా నదీ ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. అలాగే రాయ్‌పూర్, దల్బీర్ రోడ్ ప్రాంతాల్లోనూ రిస్పానా నదిలో ఇద్దరు కొట్టుకుపోయారని ఎస్‌ఈఓసీ తెలిపింది. పితోర్‌గఢ్ జిల్లాలోని మున్‌శ్యారీ ప్రాంతంలో వరదలకు ఒక బ్రిడ్జి కొట్టుకుపోయింది. రాష్ట్రంలోని కాలి, గోరి, సరయు నదలు పొంగి ప్రవహిస్తున్నాయని, రామ్‌గంగా నదీ తీరంలో ఉన్న సరస్వతీ శిశు మందిర్ నుంచి వందమంది పిల్లలను సురక్షిత ప్రాంతానికి తరలించామని తెలిపింది.