అంతర్జాతీయం

20మంది రోగుల ప్రాణాలు తీసిన నర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, జూలై 11: రోగులకు సేవ చేసి ప్రాణాలు నిలపాల్సిన ఒక నర్సు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్న జపాన్‌కు చెందిన ఒక నర్సు ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం తాను నర్సు వృత్తిలో ఉండగా 20 మందికి అపాయకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీశారు. ఈ నర్సు పేరు ఆయూమీ కుబోకి. ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. టోక్యో గ్రామీణ ప్రాంతంలో ఒక ఆసుపత్రిలో కుబోకి నర్సుగాపనిచేస్తున్నారు. ఇటీవల ఆమె 88 ఏళ్ల రోగికి రసాయనాలతో కూడిన ఒక ఇంజెక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే, తాను ఇంతవరకు 20 మందిని ఇంతవరకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు, ప్రజలు నిర్ఘాంతపోయారు. తాను ఇంజెక్షన్లలో ప్రమాదకరమైన రసాయనిక ద్రవాలను నింపి రోగులకు సూది వైద్యం చేసి చంపేసినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనకురోగుల పట్ల వ్యతిరేకత ఏమీ ఉండేది కాదన్నారు. రోగుల బాధచూడలేక ఈ ఇంజెక్షన్లు ఇచ్చేదానినని ఆమె పేర్కొన్నారు. ఈ వివరాలను జపాన్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఆమె చెప్పిన వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. ఆమె ఇంజెక్షన్లలో సర్ఫాక్టెంట్ అనే రసాయనాన్ని వాడినట్లు పోలీసులు తెలిపారు.