అంతర్జాతీయం

నవాజ్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 17: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టులో చుక్కెదురైంది. అవినీతిలో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌షరీఫ్, కుమార్తె మరియం, అల్లుడు తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను ఈ నెలాఖరుకు వరకు వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. శిక్షలను సస్పెండ్ చేయాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 25వ తేదీన పాక్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందే ఊరట కలిగితే జైలునుంచి విముక్తి కావచ్చని షరీఫ్ ఆశించారని రాజకీయ వర్గాలు తెలిపాయి. జాతీయ అకౌంటబులిటీ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ షరీఫ్ కుటుంబ సభ్యులు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ మొహిసిన్ అక్తర ఖయాని, జస్టిస్ మియాంగుల్ హసన్ ఔరంగజేబు విచారించారు. కాగా ఈ కేసులో రికార్డులను కోర్టుకు సమర్పించాని కోర్టు నేషనల్ అకౌంటబులిటీ కోర్టును ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఈ కేసులో జాప్యం లేకుండా వెంటనే అప్పీల్‌పై విచారణ చేపట్టాలని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నేత పర్వేజ్ రషీద్ హైకోర్టును కోరారు. లండన్ ఏవెన్‌ఫీల్డ్ అపార్టుమెంట్ అవినీతి కేసులో కోర్టు నవాజ్‌షరీఫ్, కుమార్తె మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్తర్‌కు జైలు శిక్షలను ఈ నెల 6వ తేదీన విధించిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ ముగ్గురిని రావల్పిండి వద్ద అడియాల జైలులో నిర్బంధించారు. లండన్ నుంచి నవాజ్ షరీఫ్, మరియంలో అబుదాబీ మీదుగా లాహోర్‌కు ఈ నెల 13వ తేదీన చేరుకున్నారు. లాహోర్ విమానాశ్రయంలో వీరిరువురిని పోలీసులు అరెస్టు చేసి రావల్పిండి జైలుకు తరలించారు. కాగా ఈ నెలాఖరుకు ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేయడంతో దేశ వ్యాప్తంగా ఈ అంశం ఆసక్తికరంగా మారింది. కోర్టు తీసుకోబోయే నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.