అంతర్జాతీయం

పెరుగుతున్న భూతాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి, జూలై 17: భూతాపం వేగంగా పెరిగి ప్రజా రోగ్యానికి ముప్పుగా తయారవుతోంది. ప్రపంచంలో భూతాపం విస్తరిస్తున్న మొదటి తొమ్మిది దేశాల్లోభారత్ ఒకటి. ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, భూతాపాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు సమగ్రమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. వాతావరణం చల్లబడేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. వాతావరణ పరిరక్షణకు స్వచ్చందసేవా సంస్థలు, వాణిజ్య, ఆర్థిక సంస్థలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం సమిష్టి ప్రణాళికను ఖరారు చేయాల్సిన అవసరం ఉందని ఈ నివేదికలో పేర్కొంది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులను నియంత్రించి, అభివృద్ధిని సాధించాలని, దీని వల్ల వృద్ధిరేటు పెరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఇంధనం అనే అంశంపై ఈ నివేదికను ఐరాస రూపొందించింది. ప్రపంచం మొత్తం మీద 1.1 బిలియన్ల మంది ప్రజలు భూతాపం వల్ల తక్షణమే సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. భూతాపాన్ని చల్లార్చేందుకు శాస్ర్తియపరమైన చర్యలు తీసుకోవాలి. దారిద్య్రం, అనారోగ్యం, వాక్సిన్లు లభ్యతగా లేకపోవడం, పౌష్టికాహార లేమి తదితర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించాలి. అసమానతలకు తావులేకుండా సమాజంలో అన్ని వర్గాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. భూపాతం వల్ల భూమి మీద మొత్తం 52 దేశాలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 1.1 బిలియన్ల మంది ప్రజల్లో 470 మిలియన్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి ఆరోగ్యకరమైన ఆహారం, మందులు లభించడం లేదు. 630 మిలియన్ల ప్రజలు వేడిగాలల తీవ్రతను నిరంతరం ఎదుర్కొంటున్నారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో 9 దేశాలు భూపాతం వల్ల సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, పాకిస్తాన్, నైజీరియా, ఇండోనేషియా, చైనా, మొజాంబిక్, సూదాన్ దేశాలు ప్రమాదపు అంచులో ఉన్నయి. నిరంతరం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారు. వీరికి చల్లటి వాతావరణం కల్పించడం లగ్జరీకాదని ఐరాస పేర్కొంది. ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి, ఈ నివేదికను రూపొందించిన రాచీల్ కైట్ తెలిపారు. 2.3 బిలియన్ల ప్రజలు రానున్న రోజుల్లో భూతాపం బారినపడే ప్రమాదం ఉంది. వీరు తాపాన్ని భరించేందుకు తక్కువ ఖర్చుతో కూడిన పరికరాలను కొనుగోలు చేస్తారు. భూతాపాన్ని చల్లార్చేందుకు అవసరమైన పరికరాలను తయారు చేసేందుకు తయారీ రంగానికి మంచి డిమాండ్ ఉంది. దీని వల్ల వాణిజ్య, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా అందుబాటులో చల్లపరిచే పరికరాలను తయారు చేయాలి. ఈ నివేదిక ప్రపంచ దేశాలకు మేలుకొలుపులాంటిదని కైట్ పేర్కొన్నారు. పారిస్‌లో వాతావరణ మార్పులపై జరిగిన సదస్సు తీర్మానం ప్రకారం కూలింగ్ ప్రక్రియకు సంబంధించిన పరికరాలను చౌకగా మార్కెట్లోకి తేవాల్సిన అవసరం ఉంది. కాగా ఈ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో ఐరాసన డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మాహమ్మద్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన ఇంధనం లభ్యతలోకి తేవడం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, దీని వల్ల అనారోగ్యం బారినపడే రిస్క్ గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో వస్తున్న మార్పులను కూడా దృష్టిలో పెట్టుకుని కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఆధునాతన టెక్నాలజీ ప్రక్రియలు తేవాలన్నారు.