అంతర్జాతీయం

నోయడాలో కుప్పకూలిన భవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోయిడా, జూలై 18: గ్రేటర్ నోయిడా బిస్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాబేరి గ్రామంలో నిర్మాణంలో వున్న ఒక భవనం కుప్పకూలడంతో ఐదుగురు మృతి చెందారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉన్నారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఆరు అంతస్థుల ఈ భవనం పక్కనే ఉన్న మరో భవనంపై పడిందని ఆయన అన్నారు. దీనితో రెండో భవనం కూడా పక్షికంగా దెబ్బతిన్నదని చెప్పారు. సంఘటన జరిగినప్పుడు, నిర్మాణంలోని భవనంలో సుమారు 12 మంది కూలీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందిందని, ఇప్పటికే ఆరు శవాలను వెలికితీశామని, శిథిలాలను పూర్తిగా తొలగిస్తేగానీ మృతులు లేదా క్షతగాత్రుల వివరాలు తెలిసే అవకాశం లేదని అన్నారు. ఇలావుంటే, నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సంఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న సీఎఫ్‌వో సిబ్బంది, అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక కార్యక్రమాలను చేపట్టారు.