అంతర్జాతీయం

నాడు సబర్మతి.. నేడు ఊహాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహాన్, ఏప్రిల్ 26: 2014లో మహాత్ముని సబర్మతీ ఆశ్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన లాంఛనప్రాయ సమావేశం తర్వాత, ఈ ఇద్దరి నేతల మధ్య మళ్లీ రెండు రోజుల పాటు ఊహాన్ నగరంలో ముఖాముఖి జరుగనుంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముదరడం, డోక్లాం సమస్య, ఎన్‌ఎస్‌జీలో భారత్ ప్రవేశాన్ని అడ్డుకోవడం, ప్రతి విషయంలో పాక్‌ను వెనకేసుకొస్తున్న చైనా వైఖరి తదితర సమస్యల నేపథ్యంలోవీరిద్దరి మధ్య జరిగే ఈ ముఖాముఖి చర్చలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 1962 చైనా దురాక్రమణ తర్వాత, 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదేశంలో పర్యటించిన తొలి ప్రధానిగా పేరుపడ్డారు. ఈ సందర్భంగా అప్పటి చైనా అధినేత డెంగ్ జియావోపెంగ్‌తో రాజీవ్ జరిపిన చర్చలు, 1962 తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో సరికొత్త శకానికి దారితీశాయి. అదేవిధంగా ప్రస్తుతం మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య ముఖాముఖి సమావేశం, వచ్చే 15 ఏళ్లలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త మలుపుకు దోహదం చేయగలదని అధికార్లు చెబుతున్నారు.
నిజానికి ఊహాన్ చైనా విప్లవ నేత మావో జిడాంగ్‌కు అత్యంత ఇష్టమైన విశ్రాంతి ప్రదేశం. ఇక్కడే చైనా అధినేత జిన్‌పింగ్, మోదీతో ముఖాముఖి స మావేశం జరుపుతారు. ఈ సందర్భంగా అంతర్జాతీ య, ప్రాంతీయ, ద్వైపాక్షిక సమస్యలు ఇద్దరు నేతల మధ్య చర్చకు రావచ్చని భావిస్తున్నారు. నగరంలోని ప్రఖ్యాత తూర్పు సరస్సు వద్ద ఇద్దరు నేతలు ఎక్కువ సమయం గడుపుతారు. ప్రకృతి సౌందర్యంతో అలరారుతూ, అతిపెద్ద యాంగ్‌ట్జ్ నది ఒడ్డున ఉన్న సుందర ఉద్యానవనం అందం వర్ణిచనలవికాదు. ఇక్కడే మావో జిడాంగ్ యాంగ్‌ట్జ్ నదిలో ఈత కొట్టేవారు. ఇక్కడ మావోకు సంబంధించిన హాలీడే విల్లాలో మోదీ-జిన్‌పింగ్‌లు భేటీ అయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఇది మావో స్మారకంగా ఉన్నది. అహమ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని జి జిన్‌పింగ్ సందర్శించినప్పుడు మోదీ ఆయనకు గాంధీ తత్వంలోని గొప్పతనాన్ని, ఆయ న ఉపయోగించిన రాట్నం గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు ఊహాన్‌లో జిన్‌పింగ్ వంతు వచ్చింది. వీరిద్దరి మధ్య చర్చల్లో వచ్చే అంశాలను అధికార్లు వివరించనప్పటికీ, తూర్పు సరస్సు ప్రాంతంలో ఇద్దరూ కలిసి నడుస్తారు, బోట్ రైడింగ్‌లో పాల్గొంటారు. ఇద్దరూ నడుస్తూ ముచ్చటించే సమయంలో వీరికి అనువాదకుల సహాయం ఉం టుంది. మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య జరిగే ఈ ముఖాముఖి సమావేశంలో ఇద్దరు నేతలు సమస్యలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే, ఇది రెండు దేశా ల సంబంధాల్లో కీలక మార్పులకు దోహదం చేయగల పరిణామంగా నిలిచిపోతుందని అధికార్లు చె బుతున్నారు. మోదీ బసకు ఏర్పాట్లు, భారత అధికా ర బృందం అంచనా వేసేదానికంటే అధికంగా అ ద్భుతమైన రీతిలో ఉంటాయని చైనా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు ఎక్కడ బస ఏర్పాటు చేస్తున్నదీ భద్రతాకారణాల రీత్యా వెల్లడించలేదు.
ఇద్దరు నేతలు ఊహాన్‌లో రెండు రోజులపాటు గడుపుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు అధికంగా ముఖాముఖి సమావేశానికే పరిమితమవుతారు. అధినేతల మధ్య ఇటువంటి ముఖాముఖి సమావేశాలు కొత్తేమీ కాదు. ఇతర దేశాల్లో కూడా ఇవి మామూలుగా జరిగేవే.
కాకపోతే ఈసారి మోదీ-జిన్‌పింగ్‌ల మధ్య జరిగే సమావేశం అనధికారికమైనదైనప్పటికీ, అధికారిక సందర్శనలకు పూర్తి భిన్నం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుగా అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్‌‘ విధానం ప్రపంచీకరణ విధానాన్ని ఏవిధంగా దెబ్బతీస్తున్నదీ, వీరిద్దరి మధ్య చర్చకు రావచ్చు. ముఖ్యంగా ట్రంప్ విధానం వల్ల నష్టపోయేది ఆసియా దిగ్గజ దేశాలైన భారత్, చైనాలు మాత్రమే. దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలపై వీరు పరస్పరం అభిప్రాయాలను తెలుపుకుంటారు. ఈ సందర్భంగా రెండు దేశామధ్య ఒప్పందాలు కుదిరే అవకాశం లేదని అధికార్లు స్పష్టం చేశారు. పెద్ద అంచనాలకు పోకుండా, రెండు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు సాధారణ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకెళతారని వారు వెల్లడించారు. రెండు దేశాలు సున్నితంగా భావించే అంశాలను పరస్పరం గౌరవించుకునే సూత్రానికి ఇద్దరు నేతలు కట్టుబడే చర్చలు జరుపుతారు. ఇదిలావుండగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ చైనాలో పర్యటించడం ఇది నాలుగోసారి. వచ్చే జూన్ 9-10 తేదీల్లో చైనాలో జరిగే ఎస్‌సీఓ సదస్సులో పాల్కొనేందుకు మోదీ మళ్లీ చైనా వెళతారు.