అంతర్జాతీయం

రష్యాపై విమర్శలపై ట్రంప్ యూ టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 19: ఇప్పటిదాకా, అమెరికా ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యం చేసుకుందని విమర్శలు గుప్పించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాదేశ అధ్యక్షుడి తప్పేమీ లేదని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా ఇంటిలిజెన్సీ వర్గాలు గత రెండు రోజులుగా చేసిన విమర్శలతో జరిగిన నష్టంపై ట్రంప్ నివారణ చర్యలు చేపట్టారు. దీనిపై రష్యా నుంచి వచ్చిన విమర్శలపై స్పందించిన ట్రంప్ 2016లో అమెరికాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రష్యా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో ట్రంప్‌కు చెందిన డెమోక్రాటిక్ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్‌కు అనుకూలంగా రష్యా ప్రచారం చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ట్రంప్ సైతం ఆ దేశానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. దీనిని అమెరికాకు చెందిన పలువురు మేధావులు, మీడియా, పార్టీకి చెందిన నేతలు తప్పుపట్టారు. దానిని సరిచేసుకోవాలని సూచించారు. అంతకుముందు ట్రంప్ సిబిఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ ‘ అమెరికా ఎన్నికల సమయంలో పుతిన్ రష్యా నాయకుడు కాబట్టి అప్పటి పరిణామాలకు ఆయనే కారణం, రష్యా అధినేతగా ఆయనే దానికి పూర్తి బాధ్యుడు’ అని ఆరోపించారు. దీనిపై పెద్దయెత్తున విమర్శలు చెలరేగడంతో యూటర్న్ తీసుకున్న ట్రంప్ పుతిన్‌తో జరిగిన సంయుక్త సమావేశంలో అది చిన్నతప్పు అంటూ వివరణ ఇచ్చుకున్నాడు. తాను మాట్లాడిన దానిలో చిన్న వ్యాకరణ దోషం దొర్లిందని, ఉడ్ నాట్‌కు బదులు ఉడ్ అన్న పదాన్ని వాడానని చెప్పారు. దీంతో పూర్తి వ్యతిరేక అర్థం వచ్చిందని ఆయన చెప్పారు. కాగా, ఇప్పటికీ రష్యా, అమెరికాను లక్ష్యంగా చేసుకుందా అని విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన ‘నో’ అని చెప్పారు.