అంతర్జాతీయం

భాష జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 19: ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నప్పుడు లేదా ఇంటర్వ్యూలు, విలేఖరుల సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించే బాషపై జాగ్రత్తలు తీసుకోవాలని పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ (ఈసీపీ) మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను హెచ్చరించింది. ప్రతిపక్ష పార్టీలనుగానీ, నాయకులనుగానీ అనుచిత భాషలో విమర్శించడం తగదని హితవు పలికింది. ఇష్టానుసారంగా మాట్లాడితే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనకు పాక్ సుప్రీం కోర్టు విధించిన పదేళ్ల శిక్షను అనుభవిస్తుండగా, అతని మద్దతుదారులు జైలు వద్ద ప్రదర్శనలు నిర్వహించడాన్ని ఇమ్రాన్ ఆక్షేపించాడు. పీఎంఎల్-ఎన్ నేతలను గాడిదలుగా అభివర్ణించాడు.కాగా, అతను చేసిన వ్యాఖ్యలు, గతంలో మాట్లాడిన మాటలను పీఎంఎల్-ఎన్ నేతలు ఈసీపీ దృష్టికి తీసుకెళ్లారు. వ్యక్తిగత విమర్శలకు దిగకుండా, పరుష పదజాలాన్ని వాడకుండా అతనిని అదుపుచేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఈసీపీ నోటిని అదుపులో ఉంచుకోవాల్సిందిగా ఇమ్రాన్‌ను ఆదేశించింది. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.