అంతర్జాతీయం

లష్కరే తోయిబాతో బహుపరాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 21: పాకిస్తాన్‌లో ఈనెల 25న జరిగే సాధారణ ఎన్నికల్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థలకు చెందిన వ్యక్తులు దాడులకు దిగే అవకాశం ఉందని, ముందుజాగ్రత్త చర్యగా దేశమంతటా భద్రతాపరంగా సురక్షిత చర్యలు చేపట్టాలని అమెరికా హెచ్చరించింది. పాక్ ఎన్నికల్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థల వ్యక్తులు పాలుపంచుకునే అవకాశం ఉందని తాము ఇంతకుముందు ఎన్నోసార్లు పాక్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపింది. ఇందుకు అనుగుణగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లతోపాటు ప్రజాజీవనానికి ఎలాంటి అవరోధం కలుగకుండా చూడాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సూచించిందని ‘డాన్’ అనే పత్రిక పేర్కొంది. అమెరికా ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో గత నెలలో మిల్లీ ముస్లిం లీగ్ (ఎంఎంఎల్) పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని ఆ పత్రిక తెలిపింది. వివిధ ఎన్నికల ర్యాలీలలో ఇటీవల పలువురు రాజకీయ నాయకులపై తీవ్రవాదుల దాడులు, దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లోనూ తగిన సరైన భద్రతా చర్యలు చేపట్టాలని అమెరికా సూచించిందని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్‌లో ఈనెలలో నిర్వహించే సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అపోహలకు తావీయకుండా, టెర్రరిస్టుల దాడులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా జరగాలని జపాన్ ఫారెన్ మినిస్టర్ టారో కొనొ ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులపై దాడులు చేయడం పాక్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి హీథర్ నాయెర్ట్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పాల్గొనే వివిధ రాజకీయ పార్టీల నాయకులకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని యూఎస్ సూచించింది. ప్రజలు కూడా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుకు ప్రభుత్వం గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తుందని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపింది.