అంతర్జాతీయం

వార్డే.. షరీఫ్ జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 30: అవినీతి కేసులో శిక్షపడి జైలు శిక్ష అనుభవిస్తూ అనారోగ్య కారణాల వల్ల ప్రిమియర్ పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (పిఐఎంఎస్)లో చికిత్స పొందుతున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ ప్రస్తుతం ఉన్న హాస్పిటల్ వార్డుని సబ్‌జైలుగా ప్రభుత్వం ప్రకటించింది. రావల్పిండిలోని అడియాల జైలులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్ హృద్రోగ సంబంధ వ్యాధితో దేశంలోనే అతిపెద్దదైన పిమ్స్‌లో ఆదివారం చేరారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా ప్రస్తుతం షరీఫ్ చికిత్స పొందతున్న పిమ్స్‌లోని కార్డియక్ వార్డు ప్రాంగణాన్ని సబ్‌జైలుగా పరిగణించాలని ఇస్లామాబాద్ చీఫ్ కమిషనర్ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేశారు.
షరీఫ్ ఇక్కడ చికిత్స పొందినంత కాలం ఆయన వార్డు ఉన్న ప్రాంగణాన్ని సబ్‌జైలుగా పరిగణిస్తారని అధికారులు తెలిపారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఆ వార్డుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నవాజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో ఆయన చికిత్స పొందుతున్న వార్డు వద్ద ఎలాంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించవద్దని తమ పార్టీ కేడర్‌ను ఆదేశించింది. ప్రస్తుతం నవాజ్ మధుమేహంతో బాధపడుతున్నారని, అంతేకాకుండా అతనికి ఇదివరకే బైపాస్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం అతడిని పరీక్షించగా, రక్తం గడ్డకట్టే లక్షణాలు కన్పిస్తున్నాయని, అందువల్ల అతనికి ఆసుపత్రిలో చికిత్స అవసరమని ఆసుపత్రి కార్డియాలజీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ నరుూమ్ మాలిక్ వెల్లడించారు.
ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. అనంతరం షరీఫ్, అతని కుమార్తె మరయమ్, అల్లుడు కెప్టెన్ మహ్మద్ సఫ్దర్‌లతో సమావేశమై నవాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు చర్చించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాక, మొబైల్ జామర్సను సైతం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఎన్నికల అక్రమాలపై
జ్యుడీషియల్ కమిషన్ వేయాలి
ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్, ఇతర అక్రమాలపై వెంటనే జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణ జరపాలని నవాజ్‌షరీఫ్‌కు చెందిన పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్-ఎన్) డిమాండ్ చేసింది. ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన రిగ్గింగ్, ఇతర చర్యలకు సంబంధించిన ఆధారాలను వెల్లడిస్తూ ఒక శే్వతపత్రం విడుదల చేస్తామని పార్టీ పేర్కొన్నట్టు డాన్ పత్రిక వెల్లడించింది. జూలై 25న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు చెందిన పార్టీ పిటిఐ 116 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. అయితే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీకి ఇంకా కొన్ని సీట్లు అవసరమయ్యాయి. అదే సమయంలో నవాజ్ నేతృత్వంలోని పార్టీకి 64 సీట్లు, జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి)కి 43 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. 342 సీట్లున్న పార్లమెంట్‌కు 272 సీట్లకు ఎన్నిక జరిగింది. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 172. కాగా ఈ ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ వేయాల్సిందేనని పిఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన నేతలు ఖాజవాల ఆసిఫ్, ఆహ్‌సాన్ ఇక్బాల్ తదితరులు డిమాండ్ చేశారు. ఇలావుండగా ఐదు ఖాళీ బ్యాలెట్ బాక్స్‌లు, 12 బ్యాలెట్ పేపర్లు కరాచి, సియోల్‌కోట్‌లో లభ్యమైన సంఘటనలపై వెంటనే పూర్తి నివేదిక పంపించాలని సింధు ఎన్నికల అధికారులను ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.