అంతర్జాతీయం

పాక్ ప్రధానిగా ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెషావర్, జూలై 30: పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అప్పటికి తమ పార్టీ అన్ని అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యతో ముందుకు సాగుతుందని అన్నారు. మొత్తం 342 మంది సభ్యులు కలిగిన జాతీయ అసెంబ్లీకి 272 మంది ఎన్నికయ్యారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 172 సీట్లు ఉండాలి. 65 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ ఈనెల 25న జరిగిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే, కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఇంకా సంపూర్ణ మెజారిటీ కావాల్సి ఉంది. అయితే, దీనిపై ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉందని, అందుకు అవసరమైన సంఖ్యాబలం కోసం తమతో చేతులు కలిపే ఇండిపెండెంట్ల మద్దతును ఆహ్వానిస్తోందని అన్నారు. తప్పనిసరిగా ఆగస్టు 11న తాను దేశ కొత్త ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, ఖైబెర్ పంక్తున్‌క్వాకు ముఖ్యమంత్రి ఎవరో వచ్చే 48 గంటల్లో వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.