అంతర్జాతీయం

వలస చట్టాలను మార్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 31: ఆరునూరైనా అమెరికా వలస చట్టాలను మార్చాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంకణం కట్టుకున్నారు. వాటి మార్పునకు సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను సైతం ఆయన లెక్కచేయకుండా తన కృతనిశ్చయాన్ని వారికి వెల్లడించారు. అమెరికాలో అమలవుతున్న అధ్వాన్నమైన ఇమ్మిగ్రేషన్ చట్టాల వల్ల మనం ప్రపంచమంతా నవ్వుల పాలవుతున్నామని, వాటిని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా యోగ్యత ఆధారిత విధానం (మెరిట్ బేస్‌డ్ సిస్టమ్) లాంటివి ఏర్పాటు చేయాలని, గొలుసుకట్టు వలస విధానాన్ని మార్చాలని, వాటి మార్పునకు యూఎస్ కాంగ్రెస్ కనుక తిరస్కరించినట్టయితే ప్రభుత్వాన్ని మూసివేస్తానని ఆయన హెచ్చరించారు. ట్రంప్ మొదటి నుంచి ఇప్పుడు అమలవుతున్న వలస విధానాలను, చైన్ మైగ్రేషన్ విధానాలను విభేదిస్తూ వచ్చారు. ఈ ఏడాది మొదట్లో మెరిట్-బేస్‌డ్ ఇమ్మిగ్రేషన్‌పై శే్వతసౌధం ఒక ప్రతిపాదన విడుదల చేసింది. అంతేకాకుండా రక్షణపరంగా పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే దీనిని సొంత పార్టీ సెనేటర్లు చాలామంది వ్యతిరేకించారు. అనంతరం 25 బిలియన్ల యూఎస్ డాలర్లతో అమెరికా-మెక్సికో సరిహద్దులో ఒక గోడను నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రపంచంలోని అత్యంత ఆధ్వాన్నంగా అమెరికా వలస చట్టాలు ఉన్నాయని, వీటిని చూసి అందరూ నవ్వుతున్నారని, వీటిని తక్షణం మార్చాలని ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో చెప్పారు. దేశ పర్యటనకు వచ్చిన ఇటలీ ప్రధాని గిసెప్పేతో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అధ్వాన్నంగా ఉన్న గొలుసు వలస విధానాన్ని మార్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ విధానం వల్ల మనం ఒకరికి దేశంలో ఉండటానికి అనుమతి ఇస్తే వారి ద్వారా 32 మంది దేశంలో ప్రవేశిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విధానాల్లో మార్పుకు సెప్టెంబర్ డెడ్‌లైన్‌గా విధించారు. అయితే ట్రంప్ విధానాలను సొంత పార్టీలోనే పలువురు విభేదించారు. ట్రంప్ చర్యతో దేశం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని, నిపుణులను కోల్పోతామని, వాణిజ్యపరంగా వెనుకబడుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఏర్పడిన స్తంభనతో ఈ ఏడాది రెండుసార్లు ప్రభుత్వాన్ని షట్‌డౌన్ కూడా చేశారు. షట్‌డౌన్‌తో దేశంలో ప్రభుత్వపరంగా కార్యక్రమాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అయితే తర్వాత కాంగ్రెస్ 1.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి అనుమతి ఇవ్వడంతో షట్‌డౌన్ ప్రమాదం తప్పింది. ఆ సందర్భంగానే ట్రంప్ తాను ఇలాంటి బిల్లుపై తిరిగి సంతకం చేసేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు అమలవుతున్న వలస విధానాన్ని పూర్తిగా మార్చాల్సి ఉందని, ఇప్పుడున్న చట్టాల ప్రకారం వలసవాదులు కోర్టుల్లో కేసులు వేస్తే వాటిని ఎదుర్కోవడానికి వేలాది మంది జడ్జిలను నియమించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలివితక్కువగా ఉన్న మన చట్టాలను పూర్తిగా మార్చాలని ఆయన స్పష్టం చేవారు. కాంగ్రెస్ ద్వారానే మనం దీనిని సాధించగలమని అన్నారు. బలమైన దేశాలకు మరింత పటిష్టమైన సరిహద్దు రక్షణ వ్యవస్థ ఉండాలన్న విషయంపై ఇటలీ ప్రధాని, తాను ఒకే అభిప్రాయంపై ఉన్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా పౌరులకు రక్షణ కల్పించడమే కాక, వారికి నాణ్యవంతమైన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందని అన్నారు. సరిహద్దు వ్యవస్థ పటిష్టవంతం, మెరిట్ బేస్‌డ్ వలస విధానాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సహకారం తప్పక అవసరమని, దీనికి అంగీకరించకపోతే షట్‌డౌన్‌కు వెనుకాడనని ట్రంప్ హెచ్చరించారు.