అంతర్జాతీయం

ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణానికి మోదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూలై 31: పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించే అంశాన్ని తెహ్రీక్ ఎ ఇన్ఫాఫ్ పార్టీ చురుగ్గా పరిశీలిస్తోంది. భారత్‌తో పాటు అన్ని సార్క్ దేశాల ప్రధానులు, అధ్యక్షులనూ ఆహ్వానించాలని ఇమ్రాన్ పార్టీ యోచిస్తోంది. జూలై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెహ్రీక్-ఈ-ఇన్సా ఫ్ అధినేత ఇమ్రాన్‌ఖాన్ ఆగస్టు 11న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రకటించారు, ఇటీవలి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం తెహ్రీక్ పార్టీకి లేకపోవడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే విజయం సాధించిన అనంతరం మే 26న భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న నరేంద్ర మోదీ సార్క్ దేశాధినేతలందరినీ ఆ హ్వానించిన విషయం తెలిసిందే. 65ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ పాక్‌లో ప్రభుత్వా న్ని ఏర్పాటుచేయనున్న నేపథ్యంలో సార్క్ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపించే పనిలో కోర్ కమిటీ నిమగ్నమైనట్టు ఆ పార్టీ ప్రతినిధి తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రధా ని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఇప్పటికే అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భం గా రెండు దేశాల మధ్య శాంతి సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని మోదీ ఆకాక్షించారు. విజయోత్సవ సభల్లో మాట్లాడిన ఇమ్రాన్ కూడా ఇండియాతో సత్సంబంధాలు అవసరమని చెప్పడం గమనార్హం.