అంతర్జాతీయం

సాదాసీదాగా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 2: పాకిస్తాన్ ప్రధానిగా పదవీ బాధ్యతలను ఈ నెల 11న స్వీకరించనున్న ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని కేవలం దేశానికి మాత్రమే పరిమితం చేయాలని, సాధ్యమైనంత వరకూ సాదాసీదాగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అతి పెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కనీస బలం లేకపోయినప్పటికీ, ఇతర పార్టీలు లేదా స్వతంత్రుల మద్దతుతో అధికార పగ్గాలు చేపట్టడానికి కపిల్ సిద్ధమయ్యారు. కాగా, భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు తదితరులను పదవీ స్వీకారోత్సవానికి ఇమ్రాన్ ఆహ్వానిస్తారని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆహ్వానం అందినా తాను వెళ్లబోనని అమీర్ ఇది వరకే ప్రకటించాడు. ఇలావుంటే, అసలు విదేశీ నేతలనుగానీ, ప్రముఖులనుగానీ పిలవకుండానే ప్రమాణ స్వీకారం చేయాలని ఇమ్రాన్ నిర్ణయించారు. అత్యంత సన్నిహితులు, పార్టీ నాయకులు, కొంత మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించాలని ఇమ్రాన్ అనుకుంటున్నట్టు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరి తెలిపారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న కొంతమంది తన స్నేహితులను ఇమ్రాన్ ఆహ్వానించే అవకాశాలున్నాయని తెలిపారు. అట్టహాస కార్యక్రమాలు ఏవీ ఉండవని, సాదాసీదాగా ప్రమాణ స్వీకారం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఇమ్రాన్ గతంలో ప్రకటించినట్టు విదేశాల్లోని సన్నిహితులను ఆహ్వానిస్తే ఆ జాబితాలో కపిల్, గవాస్కర్, సిద్ధు తదితరులు ఉండవచ్చు. పిలిస్తే వెళ్తానని సిద్ధూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.