అంతర్జాతీయం

కాబూల్ నగరంలో ఇండియన్ చెఫ్ కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఆగస్టు 2: ఆఫ్గన్ రాజధాని కాబూల్ నగరంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. భారత్‌కు చెందిన ఓ చెఫ్‌తోపాటు ఇద్దరు విదేశీయులను అపహరించుకెళ్లిన ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. ఓ అంతర్జాతీయ ఫుడ్ సర్వీస్ కంపెనీలో ముగ్గురూ చెఫ్‌లుగా పనిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. సొడెక్స్ అనే కంపెనీలో వారు పనిచేస్తున్నారు. భారత్‌కు చెందిన వ్యక్తితోపాటు మలేసియా, మాసిడోనియాకు చెందిన ఇద్దరు ఫ్రెంచ్ ఫుడ్ సర్వీసెస్‌లో చెఫ్‌లుగా పనిచేస్తున్నట్టు టోలో న్యూస్ పేర్కొంది. గురువారం తెల్లవారుజామున ముగ్గుర్నీ అపహరించుకుపోయిన ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. మృతదేహాలను ముస్సాహీలో పడేసినట్టు వార్తా సంస్థ వెల్లడించింది. కాబూల్ సిటీలోని నైన్త్ పోలీసు డిస్ట్రిక్ట్ నుంచి టయోటా కొరొల్లా వాహనంలో వచ్చిన ముష్కరులు ముగ్గుర్నీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరవై నిమిషాల తరువాత డ్రైవర్ వచ్చి ఈ విషయాన్ని సంబంధిత కార్యాలయంలో చెప్పాడు. అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో గాలించారు. రెండు గంటల తరువాత మూడు మృతదేహాలు ముస్సాహీలో కనుగొన్నారు. అయితే హత్యలకు పాల్పడింది తామేనని ఏ సంస్థా ప్రకటించుకోలేదు.