క్రీడాభూమి

అనుమతి లాంఛనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చేనెల శ్రీలంకలో భారత్, పాక్ సిరీస్‌కు అడ్డంకులు లేనట్టే?
న్యూఢిల్లీ, నవంబర్ 28: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య వచ్చేనెల పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ జరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ అనుమతి లాంఛనమేనని, ఇప్పటికే దాదాపుగా నిర్ణయాలు జరిగిపోయాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వర్గాలు అంటున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)కి అక్కడ ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించిన నేపథ్యంలో, భారత సర్కారు కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 2008 ముంబయి పేలుళ్ల సంఘటన తర్వాత పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను రద్దు చేసుకుంది. ఫలితంగా ఆ దేశంతో ఇప్పటి వరకూ పూర్తి స్థాయి సిరీస్ జరగలేదు. గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చేనెల పాకిస్తాన్‌లోగానీ, చాలాకాలంగా ఆ జట్టు హోం సిరీస్‌లను ఆడుతున్న యుఎఇలోగానీ టీమిండియా సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, యుఎఇలో మ్యాచ్‌లు ఆడబోమని బిసిసిఐ ప్రకటించింది. అంతేగాక, భారత్‌లో సిరీస్ ఆడాల్సిందిగా పాక్‌ను ఆహ్వానించింది. కానీ, భారత్ ప్రతిపాదనను పిసిబి తిరస్కరించడంతో ఒకానొక దశలో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇటీవల దుబాయ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పిసిబి అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బేటీ అయ్యారు. అటు యుఎఇ, ఇటు భారత్ కాకుండా మరో వేదికగా శ్రీలంకను వేదికగా ఎంపిక చేశారు. ఇరు క్రికెట్ బోర్డులు తమతమ ప్రభుత్వాలకు ప్రతిపాదనలను పంపాయి. పిసిబికి పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఎదురుచూస్తున్నాం: శుల్లా
పాకిస్తాన్‌తో శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే విషయంలో కేంద్రం అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు. శనివారం అతను విలేఖరులతో మాట్లాడుతూ పిసిబికి పాక్ సర్కారు నుంచి ఇప్పటికే అనుమతి లభించిన విషయాన్ని గుర్తుచేశాడు. ‘సిరీస్‌కు అనుమతిని కోరుతూ విదేశాంగ శాఖకు లేఖ రాశాం. అయితే, కామనె్వల్త్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మల్టా వెళ్లారు. ఆమె స్వదేశానికి వచ్చిన వెంటనే బిసిసిఐ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు’ అన్నాడు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు శ్రీలంకలో సిరీస్ ఆడాలని నిర్ణయించినట్టు శుక్లా చెప్పాడు. ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కాబట్టి ప్రతిపాదన పంపామని, సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అన్నాడు.
అధికారుల్లో గుబులు!
కేంద్రం అనుమతినివ్వడం లాంఛనమే అన్న వాద వినిపిస్తున్నప్పటికీ, వెంటనే సమాధానం రాకపోవ డం అధికారుల్లో గుబులు రేపుతున్నది. కొన్ని రాజకీ య పార్టీలు, సంస్థలు పాక్‌తో క్రీడా సంబంధాలు వ ద్దని డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్రం అటువైపు మొగ్గు చూపుతుందేమోనన్న అనుమానం కూడా వ్యక్తమవుతున్నది.