జాతీయ వార్తలు

మీ ఉన్నతికి కారణం ఈ దేశమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమీర్‌ఖాన్ ‘అసహన’ వ్యాఖ్యలపై అనుపమ్ ఖేర్ ధ్వజం

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో మతపరమైన అసహనం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఆత్మరక్షణకోసం దేశం విడిచి వెళ్లిపోదామా? అనే ఆలోచన కలిగిందని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. అసహనంపై కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నప్పటికీ పెదవి విప్పని అమీర్‌ఖాన్ ఇప్పుడు తన మనోభావాలను ప్రకటించి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేశారు. అయితే అమీర్‌ఖాన్ అభిప్రాయాలపై బాలీవుడ్ ప్రముఖలు తీవ్రంగా స్పందించారు. బిజెపి ఎంపీ కిరణ్ భర్త, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్విట్టర్ సందేశాలతో అమీర్‌ఖాన్‌పై విరుచుకుపడ్డారు. ‘ప్రస్తుతం నీవు ఈ ఉన్నత స్థితిలో ఉండటానికి భారత దేశమే కారణమన్న విసయాన్ని మరిచిపోవద్దని ఆయన అమీర్‌ఖాన్‌కు చురక వేశారు. కాగా, అమీర్‌ఖాన్ అనవసరమైన భయాందోళనతో సతమతమవుతున్నారని, ఆయనకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యల పట్ల బిజెపి అధికార ప్రతినిధి సాంబపాత్ర తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంచి నటుడైన అమీర్‌ఖాన్ గొప్ప చిత్రాలను నిర్మించాడని, అయితే దేశంలో అసహనం పెరిగిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, దేశంలో సహనానికి ఎప్పుడూ కొరత ఉండదని సాంబపాత్ర అన్నారు.
అమీర్ ఏమన్నాడంటే
జర్నలిజంలో ఉత్తమ విలువలు పాటించినవారికి ప్రతి ఏటా రామ్‌నాథ్ గోయెంకా పేరిట అవార్డులను ఇచ్చే కార్యక్రమం సోమవారం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో అమీర్‌ఖాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు భయాన్ని కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట జరగరాని ఘటనలు జరుగుతున్నాయని, పత్రికలను చూడాలంటేనే భయమేస్తోందని అన్నారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అసహనం వెర్రితలలు వేస్తుండటంతో తన భార్య కిరణ్‌రావు తీవ్ర ఆందోళనకు గురైందని, భద్రతకోసం దేశం నుంచి వెళ్లిపోదామా? అని ప్రశ్నించిందని అమీర్‌ఖాన్ బయటపెట్టాడు. తాజా పరిణామాలపై స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలే తప్పించి గతాన్ని తవ్వుకుంటే ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక ఇప్పుడు బిజెపి అధికారంలో ఉన్నందున ఏ సంఘటనకైనా ఆ పార్టీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, సత్వర న్యాయం లభించినప్పుడే ప్రజలు సంతృప్తిగా ఉంటారని అమీర్‌ఖాన్ చెప్పారు. (చిత్రం) ముంబయలోని అమీర్‌ఖాన్ ఇంటివద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు (ఇన్‌సెట్‌లో) పాట్నాలో అమీర్‌ఖాన్ చిత్రానికి నల్లరంగును పులుతున్న బిజెపి కార్యకర్తలు