Others

అలసితినమ్మా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క అంటేనే టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న కథానాయికకు తగ్గట్టుగానే భారీ చిత్రాలు ప్రేక్షకుల కళ్లముందు మెదులుతున్నాయి. అనుష్క నటించింది అంటే అది భారీ చిత్రమని ఈమధ్యకాలంలో వినిపిస్తున్న విషయం. కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు భారీ చిత్రాలు అనుష్కవి విడుదలయ్యాయి. ఇన్నాళ్లుగా ఒక్కరోజు సెలవు లేకుండా షూటింగ్ చేస్తూనే వుందట ఆమె. అందుకే కొన్నాళ్లపాటు అలసిన తనకు రెస్ట్ కావాలంటోంది. రెస్ట్ అంటే సినిమాల్లో నటించకుండా వుండటం కాదు. భారీ చిత్రాలలో నటించడం తగ్గించి కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే కన్పిస్తుందట. కొన్నాళ్లయినాక రీఛార్జ్ చేసుకుని భారీ చిత్రాల్లో నటిస్తానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుష్క. సో.. కొన్నాళ్లపాటు భారీ చిత్రాలు అనుష్కనుంచి ఆశించలేం. మంచి చిత్రాలు, కథకు ప్రాధాన్యమున్న చిత్రాలు, తక్కువ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తానని అంటోంది కనుక ప్రేక్షకులు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మరి బాహుబలి-2 ఎలా?