ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి అన్యాయం జరిగింది.. కేంద్రం సరిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఏప్రిల్ 19: ఏపీకి అన్యాయం జరిగింది.. కేంద్రం సరిదిద్దాల్సిన అవసరం ఉంది. విభజన సమయంలో చేసిన వాగ్దానాలన్నీ అమలుచేయాలి. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు అని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పాదయాత్ర అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పోరాటానికి ఐదు కోట్ల మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారని అన్నారు. తాను స్పీకర్‌గా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా అని కొందరు అంటున్నారని, అయితే తాను ఐదు కోట్ల మంది ప్రజల్లో ఒకడిననే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందుకే తాను ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, బీజేపీ ప్రతిపక్షంలో ఉందని, వారు పోటీ పడి అంధ్రప్రదేశ్‌కు ఎన్నో వాగ్దానాలు చేశారని, క్యాబినెట్ సమావేశాల్లో చట్టాలు చేశారని స్పష్టం చేశారు. అమరావతిని ఢిల్లీ కన్నా బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడిచింది.. ఆశగా ఎదురుచూశాం, అరుంధతీ నక్షత్రంలా చూపించారు.. ఏమీ చేయలేదు.. ఇప్పుడు ఉద్యమం పరాకాష్టకు చేరింది.. తెలుగువారి సత్తా ఏమిటో చూపించాలన్నారు. ప్రధాని స్వీడన్ పర్యటనకు వెళితే అక్కడ ఉన్న తెలుగువారు ఆయనకు తెలుగువారికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. అంధ్రులకు అన్యాయం అంతర్జాతీయ సమస్యగా తయారైందన్నారు. అహింసా మార్గంలో ఆందోళన చేస్తే, కేంద్రం దిగి వస్తుందని పిలుపునిచ్చారు. పార్టీ మీద అభిమానంతో కాదు.. అన్యాయాన్ని ఎదుర్కోవాలన్నారు. కేంద్రం దిగివచ్చి వాగ్దానాలు నెరవేర్చే వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడెల శివరాం, ఎంపీపీలు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చిత్రం..నరసరావుపేట నుండి కోటప్పకొండకు స్పీకర్ కోడెల సైకిల్‌యాత్ర చేస్తున్న దృశ్యం