ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో చంద్రబాబుకు గుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కర్నూలు జిల్లా నంద్యాలలో హిజ్రాలు కడుతున్న గుడికి మంత్రి అఖిలప్రియ శుక్రవారం భూమి పూజ చేశారు. తమకు పెన్షన్లు ఇవ్వడమేగాక ప్రభుత్వ పథకాలు వర్తింపజేసినందుకు కృతజ్ఞతగా హిజ్రాలు నంద్యాల శివారు పెద్దకొట్టాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 20 సెంట్ల స్థలం కూడా సేకరించారు. బాబు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం గుడి నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, అఖిల భారత హిజ్రాల సంక్షేమ సంఘం నాయకులు పిడిశల విజయకుమార్, పలువురు హిజ్రాలు పాల్గొన్నారు. గుడిలో బాబు వెండి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

చిత్రం..గుడికి భూమిపూజ చేస్తున్న మంత్రి అఖిలప్రియ