ఆంధ్రప్రదేశ్‌

భారతంలో ఒక్కడే.. ఏపీలో ఇద్దరు శిఖండులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 20: నాటి మహాభారతంలో ఒక్క శిఖండి మాత్రమే ఉంటే, నేటీ నవ్యాంధ్రప్రదేశ్‌లో ఇద్దరు శిఖండులు ఉన్నారని ప్రముఖ సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. ఆ ఇద్దరు శిఖండులు కలసి రాష్ట్రాన్ని విచ్ఛినం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలోని ఇందిరా గాందీ మున్సిపల్ మైదానంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం హోదాపై పోరాడేందుకు ప్రత్యక్షంగా రాని కారణంగానే ఏపీలో పలు సందర్భాల్లో బంద్‌లను నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై పోరాడేందుకు ముందుకు రావడంతో ఇక మన పోరు రైలు పట్టాలపైనే సాగనుందన్నారు. ఇక నుంచి అందరం కలిసి కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఢిల్లీలో కూడా పోరాటం చేద్దామన్నారు. ప్రతీ ఊళ్లో రైలు ట్రాక్‌పై కూర్చొని ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఊళ్లో ఎర్రజండా పాతితే రైళ్లు ఆగిపోతాయన్నారు. కేంద్రంలోని బీజేపీ నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడ ఇంగా ఆగలేదన్న ఆయన రాష్ట్రంపై మరిన్ని కుట్రలు పనే్న ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటి పూర్తి వివరాలను ఈనెల 30వ తేదిన వెల్లడిస్తానని ప్రకటించారు. ఏదో ఒక రూపంలో రాష్ట్రాన్ని ఒత్తిడికి గురి చేసి హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఒకవైపు అమరావతి కోసం మన రైతులు వేల ఎకరాలను స్వచ్ఛందంగా అందజేస్తే, దానిని కొందరు శిఖండులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారి పేర్లు నేను చెప్పను...చెప్పలేను..మీరు చెప్పగలరా ఎవరన్నా..అని ఆయన సభా ముఖంగా అడిగారు. ఈ మధ్య ప్రశాంతంగా రిటైరయియిపోయారన్న ఆయన ఈ ఇద్దరు శిఖండులు రాజధానిపై నిరాదార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారిద్దరికీ ఈ నెల 30న ఆధారాలతో సరైన సమాధానం తప్పక చెబుతానన్నారు. వీరితో పాటు మరికొందరు జాతీయ పార్టీతో కలసి కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. వారి బండారం మొత్తం త్వరలోనే వెల్లడిస్తానన్నారు. తన ప్రసంగం మధ్యలో బాలకృష్ణతో తోడ కొట్టించిన శివాజీ, మీసం మెలేసి హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.