ఆంధ్రప్రదేశ్‌

అందరితో కలసి ఢిల్లీలో దీక్ష చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 20: హోదా పోరాటంలో రాష్ట్రంలో ఐకమత్యం లేని కారణంగానే ఢిల్లీలో అందరూ తెలుగు వారిని లోకువగా చూస్తున్నారని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందరం కలసి ఢిల్లీ దద్దరిల్లేలా గర్జించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన ఒక్క రోజు ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ఆయన సీఎం చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో టీడీపీ, వైకాపా ఎంపీలు హోదా కోసం బాగానే పోరాటం చేశారని కొనియాడారు. మనలో ఐకమత్యం కొరవడిన పరిస్థితుల కారణంగానే ఇతరుల వద్ద చులకనై పోతున్నామనని అవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రుల హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితులను నేడు కేంద్రం కల్పించిందన్నారు. పోరాటంలో ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆంధ్రులు ఈ రోజు అవమానభారంతో ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడానికి మూల కారణం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలేనన్నారు. రాష్ట్ర విభజన హామీలను ఒకవైపు ఉద్యమంతో, మరోవైపు చాకచక్యంతో సాధించుకోవాలన్నారు.
ఉద్యమ స్ఫూర్తి నలుచెరగులా చేరాలంటే, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు, న్యాయవాదులు, వైద్యులు, సమాజంలో అన్ని రంగాల వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వీరందరినీ కలుపుకుని, అందరినీ ఎకతాటిపైకి తీసుకు వచ్చి ఐక్యంగా కలిసి ఢిల్లీలో దీక్ష చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఈ విషయంలో రెండు మూడు మెట్లు తగ్గయినా సరే, అందరినీ కలుపుకుని పోవాలన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం మన మాట వినాలంటే రాష్ట్ర మొత్తం ఒకటిగా ఉండాలన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావుని స్ఫూర్తిగా తీసుకుని అందరం కలిసి దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదం చేయాలన్నారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్రం, వారికి సహకరించిన, వంతపాడిన వారికి తగిన బుద్ధి చెప్పి ఎండగడదామన్నారు.