ఆంధ్రప్రదేశ్‌

పోరాటానికి సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: రాష్ట్ర విభజన హామీల అమలుకు కేంద్రంపై పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెన్నై తెలుగు అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. చెన్నై నుంచి ఈ సంఘానికి చెందిన కొంతమంది సభ్యులు కార్లతో ర్యాలీగా బయలుదేరి, ఉండవల్లి గ్రీవెన్సు సెల్‌లో ముఖ్యమంత్రిని శనివారం కలిశారు. చెన్నైలో వివిధ వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్న వీరు, రాజధాని నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలను సీఎంకు విరాళంగా అందచేశారు. నెల్లూరులో వీరికి మంత్రి సోమిరెడ్డి కుమారుడు స్వాగతం కలుగా, కందుకూరులో ఎమ్మెల్యేలు పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్ భోజన వసతి కల్పించారు. సీఎంకు ఆ అసోసియేషన్ సభ్యులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి పరిచయం చేశారు. వీరంతా నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని రావడం గమనార్హం. సీఎం వీరిని అభినందించారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉన్నారని, ఎక్కడ ఉన్నా తెలుగువారు ఐక్యంగా ఉండాలని, తనకు సహకరించాలని పిలుపునిచ్చారు. మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
విభజన హామీలు 100 శాతం అమలు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. 2019 ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారందరికీ పేరుపేరునా అభినందిస్తున్నానని, ప్రపంచంలోని తెలుగువారికి స్ఫూర్తినిస్తారన్నారు.