ఆంధ్రప్రదేశ్‌

పవన్ క్షమాపణ చెప్పాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 21: ప్రజాస్వామ్యంలో నాలుగోస్తంభం అయిన మీడియాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరించడం తగదని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నించడానికి వస్తున్నానని చెప్పిన నాటి నుండి ఏపీలో పవన్ కల్యాణ్‌కు తోడుగా ఉంటూ ఆయన పోరాటాలను ప్రజల్లోనికి తీసుకు వెళ్లేందుకు మీడియా ఎంతగానో సహకరిస్తే దానిపైనే దాడి చేసేవిధంగా ప్రేరేపించడంతో పాటు దాడి చేయించడం ఎంత వరకు సమజసమన్నారు. సోషల్ మీడియాలో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు న్యూస్ ఛానల్స్ బ్యాన్ చేయండి అంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటనలతో పాటు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద మహిళా మీడియా ప్రతినిధులపై దాడి, పలు మీడియా వాహనాల ధ్వంసాన్ని నిరసిస్తూ పలు జర్నలిస్టు సంఘాలు విజయవాడలోని బెంజ్‌సర్కిల్ వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ జర్నలిస్ట్ ఫోరమ్, ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్‌తో పాటు పలు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో బెంజ్‌సర్కిల్ వద్ద ధర్న నిర్వహించడంతో పాటు మానవహారాన్ని నిర్వహించారు. పవన్ డౌన్ డౌన్, పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలి, మీడియాపై దాడిని ఖండించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మీడియాను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై పవన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియాపై దాడులు, న్యూస్ ఛానల్స్‌ను బ్యాన్ చేయాలనే ప్రకటనలపై 24 గంటల్లో పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.