ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: ప్రయాణికుల సేవలో 86 ఏళ్ల ఉజ్వల చరిత్రతో అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న ఏపీఎస్ ఆర్టీసీ మరిన్ని నాణ్యమైన సేవలు, మెరుగైన రవాణా సదుపాయాలను ప్రయాణికులకు అందించడానికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశంలోని చాలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకుంటూ కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ రోడ్డు భద్రత, ఇంధన పొదుపు, అతి తక్కువ ప్రమాదాల రికార్డు వంటి అనేక అంశాల్లో జాతీయ స్థాయి అవార్డులు పొందుతూ ముందుకు సాగుతున్న సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ. ప్రస్తుతం 128 డిపోలు, 11,756 బస్సులు, 3794 మార్గాల్లో, 42.92 లక్షల కి.మీల దూరం నడిపి 67 లక్షల మంది ప్రయాణికులను విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపార ప్రయాణ అవసరాలకు గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ప్రమాదాలు అభివృద్ధి నిరోధకాలు. అందుకే జాతీయ స్థాయిలో ఈ ప్రమాదాల నివారణకు జరుపుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలను ఆర్టీసీ త్రికరణ శుద్ధితో ఆచరిస్తోంది. ఈనేపథ్యంలో సంస్థ ఎండీ, వైస్ చైర్మన్ ఎన్వీ సురేంద్రబాబు నేతృత్వంలో సోమవారం నుంచి వారం రోజులు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరగబోతున్నాయి.