ఆంధ్రప్రదేశ్‌

వచ్చే 7న విజయవాడలో ‘ఆర్థిక’ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 22: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చలాయించేందుకు వీలుగా 15వ ఆర్థిక సంఘం నిబంధనలు రూపొందించారని, దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో రెండో సమావేశం విజయవాడలో మే 7న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అజెండా ఖరారుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఆదివారం విజయవాడలో సమావేశమై చర్చించారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలు, నిధుల కేటాయింపు, తదితర అంశాలపై ఇప్పటికే కేరళలోని తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశం జరగడం తెలిసిందే. కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఎక్కువ ఆదాయాన్ని సముపార్జిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరగడంపై వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తమ గళం విప్పారు. ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రెండో సమావేశాన్ని వేదికగా చేసుకుంటున్నారు. తొలి సమావేశం కంటే మరింత లోతుగా, విస్తృతంగా చర్చించేందుకు దేశంలోని బీజేపీ యేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. ఆర్థిక రంగ నిపుణులను కూడా భాగస్వాములను చేయడం ద్వారా చర్చలు మరింత ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నారు.
రెండో సమావేశానికి విశాఖను వేదికగా ప్రతిపాదించినప్పటికీ చివరకు విజయవాడను ఖరారు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు తోడు ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను ఆహ్వానించాలని ప్రతిపాదించారు. ఈనేపథ్యంలో అజెండా ఖరారు, తదితర అంశాలపై యనమల రామకృష్ణుడుతో థామస్ సమావేశమయ్యారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు జరిగే నష్టంపై చర్చించేందుకు వీలుగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.