ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్ రాయబారానికి వచ్చినా పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 24: ప్రత్యేక హోదా కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున ప్రధానితో ధర్మపోరాటం చేస్తున్నారని, గవర్నర్ రాయబారానికి వచ్చినా ఈ పోరాటం ఆగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని చెప్పడం కంటే, జరుగుతున్నది, జరిగేది గవర్నర్ కేంద్రానికి చెప్పాలని, అలా చేయకపోవడం వల్లే ఏపీలో ప్రత్యేక హోదా పోరు ధర్మపోరాటంగా మారిందన్నారు. మంగళవారం ఇక్కడ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం తొలుత ధర్మపోరాటం చేపట్టామని, అందుకు ప్రధాని, ఆయన ప్రభుత్వం ఏపీ పట్ల అనుకూలంగా వ్యవహరించకపోతే, ప్రజాబ్యాలెట్ ఉద్యమం వైపే అడుగులు వేస్తామన్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు ఈశ్వరయ్య బాబు పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ అవగాహన లేకుండా మాట్లాడడాన్ని అచ్చెన్న ఖండించారు. .పట్టిసీమ అవినీతిపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడే మాటలకు విలువలేదని కొట్టిపారేసారు. ధర్మపోరాట దీక్ష రోజునే పవన్‌కళ్యాణ్ ఐదు కోట్లు ఆంధ్రులు, మీడియాను దారిమళ్ళీంచేలా ఎందుకు హడావుడి చేసారని ప్రశ్నించారు.