ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర విచ్ఛిన్నానికి కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 24: రాష్ట్రంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, వైకాపా, జనసేన పార్టీలు కుట్ర పన్నాయని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. కర్నూలులో మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశ దిశ లేని వైకాపా అధినేత జగన్ సీఎం కుర్చీ కోసం అర్రులు చాస్తూ దాన్ని అందుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. తాను సీఎం అయినట్లు పగటికలలు కంటూ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయి పదవి కోసం పడరాని పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఎత్తుగడ వేసిన బీజేపీ అధినేత అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాచిక పారకపోవడంతో రాష్ట్రానికి చేయాల్సిన సహాయం చేయకుండా ఆటంకాలు కల్పించారని అన్నారు. తమకు లొంగని చంద్రబాబు నాయుడును దెబ్బ తీయడానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను పావుగా వాడుకుని రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులను భగ్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. సినీనటి శ్రీరెడ్డి దూషించిన మూడురోజుల తరువాత ఫిలిం ఛాంబర్‌లో పవన్ హడావుడి చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు దీక్షకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు కారణంగా ప్రజల దృష్టి మరల్చడానికి అప్పటికప్పుడు బీజేపీ పెద్దలు పవన్‌ను ఆందోళనకు పురిగొల్పారని ఆరోపించారు. రాజకీయాలు తెలియని పవన్ సినీనటుడిగా తనదైన శైలిలో డ్రామాను రక్తికట్టించినా జనం మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. మోదీ అంటేనే ‘మాస్టర్ ఆఫ్ డెస్ట్రాయింగ్ ఇండియా’ అని ఆయన అభివర్ణించారు. దేశాన్ని అస్థిరపర్చి తన పబ్బం గడుపుకోవడమే మోదీ లక్ష్యంగా కనిపిస్తోందని కేఈ అభిప్రాయపడ్డారు. ఇటీవల లండన్ పర్యటనలో మోదీ భారీ అప్పు ఎగవేతదారులైన నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యాలతో సమావేశమైనట్లు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. దేశం ప్రమాదకర రోజుల్లో ఉందని, మోదీని వీలైనంత తొందరగా గద్దె దించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.