ఆంధ్రప్రదేశ్‌

తెగని ఆళ్లగడ్డ పంచాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ /నంద్యాల, ఏప్రిల్ 25: ఆళ్లగడ్డ పంచాయతీ మళ్లీ వాయిదా పడింది. బుధవారం సీఎం సమక్షంలో మంత్రి అఖిల ప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తమ వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే మంత్రి అఖిల ప్రియ రాజధానికి వెళ్లకపోవడంతో సమావేశం గురువారానికి వాయిదా పడినట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మంత్రి అఖిల ప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం చేపట్టిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం చర్చలకు రావాలని ఇద్దరు నేతలకు పార్టీ కబురుపెట్టింది. అయితే మంగళవారం భూమా శోభానాగిరెడ్డి వర్ధంతి ఉండడంతో తాను రాలేనని అఖిల ప్రియ చెప్పడంతో సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ఏవీ సుబ్బారెడ్డి బుధవారం రాజధానికి చేరుకుని పార్టీ పెద్దలను కలిసి ఆదివారం శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా తనపై జరిగిన దాడి గురించి వివరించినట్లు సమాచారం. మంత్రి అఖిల ప్రియ మాత్రం అటు సైకిల్‌యాత్రలో పాల్గొనకుండా, ఇటు అమరావతికి వెళ్లకుండా స్వగ్రామంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి సమక్షంలో జరిగే పంచాయతీకి తాను ఎందుకు హాజరవ్వాలని తన అనుయాయులతో అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గురువారం నాటి పంచాయతీకి హాజరుకావాలని మంత్రి అఖిల ప్రియకు అమరావతి నుండి పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు తెలిసింది. గురువారం నాటి పంచాయతీకి మంత్రి హాజరవుతారా లేరా అన్నది వేచిచూడాల్సిందే.