ఆంధ్రప్రదేశ్‌

మరో రిజర్వేషన్ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: రిజర్వేషన్ పోరుకు మరో కుల సంఘం గళమెత్తుతోంది. మొన్నటి వరకూ కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడగా, ప్రభుత్వం కమిటీ వేసి కాపులను బీసీల్లో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. ఆపై మత్స్యకారులను ఏస్టీల్లో చేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకార సంఘాలు దాదాపు రెండు నెలల పాటు ఉద్యమించాయి. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఎస్టీల్లో చేర్చేందుకు అంగీకరిస్తూ హామీ ఇవ్వడంతో శాంతించారు. తాజాగా రాష్ట్రంలోని 13 జిల్లాలోల బేడ జంగమ కులస్తులు గతంలో తమకు కల్పించిన ఎస్సీ రిజర్వేషన్‌ను తిరిగి కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 1976లో చట్ట సవరణ ద్వారా బేడ జంగమ కులాన్ని ఎస్సీలుగా గుర్తిస్తూ వచ్చారు. అయితే 1985లో రాష్ట్ర ప్రభుత్వం ఈ గుర్తింపును తొలగించింది. దీనిపై బేడ జంగమ సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తిరిగి కొనసాగించారు. 2008లో జీఓ 144 ద్వారా బేడ జంగమ కులానికి ఎస్సీ గుర్తింపును రద్దు చేశారు. ఇదే అంశంపై ఒకప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిస్వామి బేడ జంగమ కులానికి సంబంధించి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య రాష్ట్రంలో 64వేలుగా నిర్ధారించింది..