ఆంధ్రప్రదేశ్‌

మహానాడులో ‘మీడియా’కు ప్రత్యేక ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 19: ఈనెల 27,28,29 తేదీల్లో విజయవాడలో జరుగనున్న మహానాడుకు దేశ విదేశాల్లో సైతం విస్తృత ప్రచారం కల్పించడానికి టీడీపీ అధినాయకత్వం సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా సచివాలయంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కార్యాలయంలో సోమిరెడ్డితో పాటు జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ అధ్యక్షతన శనివారం మహానాడు మీడియా కమిటీ సమావేశం జరిగింది. మీడియా మిత్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ మీడియా ప్రతినిధులకు, హైదరాబాద్, విజయవాడ మీడియా ప్రతినిధులకు కావలసిన సౌకర్యాలు చూసేందుకు ఒక్కొక్క బృందానికి ఇన్‌ఛార్జిగా తెలుగుదేశం పార్టీ నాయకులను నియమించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ మీడియా కమిటీ కన్వీనర్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, రాష్ట్ర నాయకులు లింగంనేని శివరామప్రసాద్, విజయవాడ పట్టణ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి సింహాద్రి అశోక్, కృష్ణాజిల్లా అర్బన్ ప్రచార కార్యదర్శి కె.చంద్రశేఖర్ పాల్గొన్నారు.