ఆంధ్రప్రదేశ్‌

‘జన్మభూమి’ కమిటీలపై రచ్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను కొనసాగిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం జన్మభూమి కమిటీలను నియమించారు. ప్రభుత్వం అమలుచేసే వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల పాత్ర కీలకంగా మారింది. ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులే నేరుగా జన్మభూమి కమిటీలను నియమించారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆయా కమిటీ సభ్యులను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని ముందుకు నడిపిస్తున్నారు. దీంతో వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వ యంత్రాంగం పాత్ర నామమాత్రంగా మిగిలింది. ఈ జన్మభూమి కమిటీల కారణంగా వివిధ గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో కేవలం అధికార టీడీపీ కార్యకర్తలకే పెద్ద ఎత్తున ప్రయోజనం లభిస్తోందని ప్రతిపక్షాలు వాపోతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారికి లేక వారి బినామీలకు జన్మభూమి కమిటీలతో పెద్ద ఎత్తున లబ్ది చేకూరుతోందని తెలుస్తోంది. అలాగే ఈ జన్మభూమి కమిటీల ముసుగులో కొందరు ప్రజాప్రతినిధులు కొన్ని సంక్షేమ పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపికలో భారీగా సొమ్ములు గుంజుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కొందరు నేతలు వ్యక్తులు గృహ నిర్మాణానికి లబ్ధిదారులను ఎంపిక చేయడంలో భారీ మొత్తాలను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పేదలకు పక్కా గృహాలు నిర్మించే పథకాలను అమలుచేస్తోన్న నేపథ్యంలో ఒక్కొక్క లబ్ధిదారుడి నుండి ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో లక్ష రూపాయల వంతున వసూలు చేశారు. అనంతరం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మాత్రమే అధికారికంగా ప్రకటించాల్సిందిగా సంబంధిత అధికారులపై వత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ పట్టాల మంజూరు వంటివన్నీ కేవలం జన్మభూమి కమిటీల ద్వారానే జరగాలన్న నిబంధనకు ప్రభుత్వ యంత్రాంగం సైతం చేసేది లేక సహకరిస్తోంది. ప్రభుత్వ పథకాలను గతంలో కేవలం ఆయా శాఖల అధికారులు మాత్రమే అమలుచేసేవారు. అప్పట్లోనూ అధికార పార్టీ నేతల సిఫార్స్‌లు నడిచినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంలో నేరుగా పథకాల అమలు బాధ్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్భ్రావృద్ధికి ఈ జన్మభూమి కమిటీలు అడ్డుతగులుతున్నాయని, వాటిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలను జన్మభూమి కమిటీలు నిర్వీర్యం చేస్తున్నాయని, అభివృద్ధి నిరోధకంగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు జన్మభూమి కమిటీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జన్మభూమి కమిటీల ద్వారా ప్రభుత్వం చేసిన అక్రమాలను ప్రజల్లో ప్రచారం చేస్తామని బీజేపీ సీనియర్ నేత యెనిమిరెడ్డి మాలకొండయ్య చెప్పారు.