ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం పంతులు చరిత్రను విద్యార్థులకు బోధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 20: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితచరిత్రలోని అన్ని అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చి భావితరాల విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో ఆదివారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ప్రకాశం పంతుల విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోదరాయునిపాలెంలో ఆయన పర్యటించారు. తరువాత గ్రామస్థులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై సావధానంగా చర్చించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ అభిప్రాయాలతో విభేదాలు వస్తే ధైర్యంగా ఆయనకే తన వ్యతిరేకతను చెప్పగలిగిన సాహసవంతుడు అని కొనియాడారు.