ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: కేంద్రంలో రాబోయేది బీజేపీయేతర ప్రభుత్వమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారమని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడటానికి నాంది బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల భేటీ అని తెలిపారు. చంద్రబాబును ప్రజలకు దూరం చేయాలనేదే బీజేపీ, వైకాపాల కుట్ర అని ధ్వజమెత్తారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్ష నేతలతో సీఎం సమావేశమయ్యారని గుర్తుచేశారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. జేడీఎస్ ఆహ్వానం మేరకే ప్రమాణ స్వీకారానికి సీఎం వెళ్లారని.. కాంగ్రెస్ పిలిచిందని వెళ్లలేదని తెలిపారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు ప్రధాన భూమిక పోషించారని, దేవగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానమంత్రులు కావడానికి సీఎం కీలకపాత్ర వహించారని తెలిపారు. కాంగ్రెస్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ హాజరయ్యారని వేదికపై ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారమని గుర్తుచేశారు.