ఆంధ్రప్రదేశ్‌

ఉద్దానం బాధితులకు ప్రభుత్వం బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంటే వాస్తవాలను పక్కనపెట్టి కొంతమంది రాజకీయాల కోసం ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ఉండవల్లిలోని తన నివాసం నుంచి గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రం కావడంపై స్పందిస్తూ, ప్రభుత్వం దృష్టికి రాగానే యుద్ధప్రాతిపదికన స్పందించి తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఉద్దానం ఏడు మండలాల్లో 15 ప్రత్యేక సంచార వైద్య బృందాలను ఏర్పాటు చేశామని, 1.01 లక్షల మంది నుంచి సీరమ్ క్రిటినిస్, రక్తపరీక్ష నిమిత్తం రక్త నమూనాలను సేకరించామని తెలిపారు. సోంపేట కమ్యూనిటీ హాల్ సెంటర్‌లో సీకేడీ కేసుల నిమిత్తం ఒక ప్రయోగశాల ఏర్పాటుచేశామని, ఐదు ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఐదు కేంద్రాల్లో 50 డయాలసిస్ మిషన్లు రోజుకు మూడు సెషన్లలో పనిచేస్తున్నాయని తెలిపారు. 2761 మందికి నెలకు వైద్య ఖర్చుల నిమిత్తం 2,500 రూపాయలు పింఛన్ అందజేస్తున్నామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఉద్దానం ప్రాంతంలో 17కోట్లతో ఏడు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసి సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఉద్దానం ప్రాంతంలోనే ఈ వ్యాధి ఎందుకు వ్యాపిస్తోందో పరిశోధనలు చేసేందుకు ఐసీఎంఆర్ ద్వారా కాంపిటీటివ్ గ్రాండ్ ఛాలెంజ్ విధానంలో ఆస్ట్రేలియాకు చెందిన జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌ను ఎంపిక చేశామని తెలిపారు. విశాఖపట్నం విమ్స్‌లో ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని తెలిపారు. నామినేషన్ ప్రాతిపదికన పనులు అప్పగించాలని కోరటంతో ప్రభుత్వ నిబంధనలు అనుమతించకపోవటం ఆర్థికపరమైన అంశాల కారణంగా హార్వర్డ్ వైద్య బృందం సేవలు అందుబాటులోకి రాలేదని వివరించారు.
ఆక్వా రైతుల సమస్యలపై స్పందించాలి
రాష్ట్రంలో ఆక్వా రైతుల సమస్యలపై కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే ముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆక్వా ధరల పతనంపై అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆక్వా ఎగుమతుల వల్ల విదేశీ వాణిజ్యం పొందేది కేంద్రమేనని గుర్తుచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తక్షణమే జోక్యం చేసుకుని ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈ విషయమై తాను కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశానని చెప్పారు.