ఆంధ్రప్రదేశ్‌

జగన్‌కు వినతుల వెల్లువ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మే 24: పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న వైసీపీ అధినేత, విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుండి వినతులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ వర్గాలు తమ సమస్యలపై విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉద్యోగులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాలవారు తమ సమస్యలను ఆయన ముందు ఏకరువు పెడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యాలపై కూడా పలువురు ఫిర్యాదులు చేశారు. జిల్లాలో జగన్ యాత్ర 170వ రోజైన గురువారం సరిపల్లి శివారు నుంచి ప్రారంభమై ఆరేడు, ఉప్పులూరు క్రాస్, కోలమూరు, పాములపర్రు, వెంకట్రాజుపురం మీదుగా పెదకాపవరం వరకు సాగింది. ఈ యాత్ర ప్రారంభంలోనే ఆరేడు వద్ద ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్ రోజు అంతా ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. బుధవారం సాయంత్రానికి 2120 కిలోమీటర్లు నడిచిన జగన్ గురువారం 12.7 కిలోమీటర్లు నడిచి ఇంతవరకు 2132.7 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు. కాగా అడుగడుగునా జగన్ పాదయాత్రకు స్థానికులు ఘనస్వాగతం పలుకుతూ సంఘీభావం ప్రకటించారు. ఉంగుటూరు నియోజకవర్గం కాగుపాడు గ్రామస్థులు అక్కడి టీడీపీ నేతల దౌర్జన్యాలను వివరించారు. ఉండి నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్‌కు స్ధానిక నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కొల్లేరు ప్రాంత గ్రామాలకు చెందిన పలువురు మహిళలు జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. విచ్చలవిడిగా ఏర్పాటైన చేపల చెరువుల వల్ల భూగర్భజలాలన్నీ కలుషితం అయ్యాయని పేర్కొంటూ అక్కడి నుంచి సీసాల్లో తెచ్చిన నీటిని చూపారు. దీనిపై స్పందించిన జగన్ ఆ మహిళలకు సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. మరోవైపు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సిపిఎస్) ఉద్యోగులు కూడా జగన్‌ను కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. ఈవిధానం వల్ల తామెంతో నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. ఎలాగైనా ఈపథకం రద్దు అయ్యేలా చూడాలని కోరారు. దీనిపై ఇప్పటికే తనకు స్పష్టమైన అవగాహన ఉందని, తాము అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా సిపిఎస్‌ను రద్దుచేస్తామని ప్రకటించారు. ఆరేడులో జగన్‌ను ఆక్వా రైతులు కలుసుకున్నారు. రొయ్యలు, చేపల చెర్వుల రైతులకు విద్యుత్ ఛార్జీలను తగ్గించటంతోపాటు ఆక్వా రంగాన్ని ఆదుకుంటానని జగన్ చేసిన ప్రకటనపై వారు హర్షం వ్యక్తంచేశారు. ఉప్పులూరు క్రాస్ మీదుగా కోలమూరు చేరుకున్న జగన్‌కు స్ధానిక రైతు తిరుపతిరాజు తన ఒంగోలు గిత్తను చూపారు. దాన్ని చూసి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. కోలమూరులో జగన్‌ను విశాఖపట్నానికి చెందిన ప్రముఖ బిల్డర్ ఎంవివి సత్యనారాయణ కలుసుకుని పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాదయాత్రలో భాగంగా పాములపర్రు చేరుకున్న జగన్‌ను స్ధానిక టిడిపి సర్పంచ్ వీరప్ప కలుసుకుని వైకాపాలో చేరారు. తాము అధికారంలోకి రాగానే ఆక్వా రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. ఆతర్వాత వెంకట్రాజుపురం చేరుకున్న జగన్‌ను గ్రామశివారులోని ఎస్టీ కాలనీవాసులు కలుసుకున్నారు.

చిత్రం..కలుషిత జలాలను సీసాలో తెచ్చి జగన్‌కు చూపుతున్న మహిళలు