ఆంధ్రప్రదేశ్‌

విశాఖ, కృష్ణా జిల్లాల్లో వైద్యసేవలపై సీఎం ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 25: కృష్ణాజిల్లా నందిగామ, విశాఖ జిల్లా కలిగాం ప్రాంతాల్లో వైద్య సేవల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ ప్రాంతాల్లో డెంగీ, విష జ్వరాలు ప్రబలడంతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, విశాఖ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటువ్యాధులపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని, అవగాహన పెంచాలన్నారు. నందిగామ, కలిగాం ప్రాంతాల్లో ఇప్పటికే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు. సోమవరంలో ముగ్గురికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ, విషజ్వరాలు, డెంగీ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటిలో కాలుష్యం నివారించాలని, సురక్షిత నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. లీక్ అవుతున్న పాత మంచినీటి సరఫరా పైపులైన్లను తొలగించాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, నీటిసరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.