ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ రొంపిలోకి శ్రీవారిని లాగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 25: శ్రీవారి దర్శనార్థం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తుల సేవే పరమాధిగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రమణదీక్షితులు చేసిన ఆరోపణల నేపధ్యంలో తిరుమల పవిత్రతను, టీటీడీ ప్రతిష్టను పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టీటీడీ ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో నినదించాయి. రమణదీక్షితులు టీటీడీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం ఉదయం గంటన్నర పాటు పలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులు టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగవద్దని హితవుపలికారు. 24ఏళ్లపాటు శ్రీవారిని భక్తివిశ్వాసాలతో కొలిచి ఇప్పుడు ఆలయ నిర్వహణ, కైంకర్యాలపై విమర్శించడం రమణదీక్షితులకు తగదన్నారు.. నిజంగా శ్రీవారి ఆలయంలో ఏవైనా సమస్యలు ఉండి ఉంటే ఆలయ ప్రధాన అర్చకుడి హోదాలో టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి కాని, పాలక మండలి దృష్టికి కాని తీసుకువెళ్లాలన్న కనీస ధర్మాన్ని దీక్షితులు పాటించకపోవడం బాధాకరమన్నారు. శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో సిసి కెమేరాల నీడలో ప్రతి పని జరుగుతున్నప్పుడు ఆలయంలో తవ్వకాలు జరిపారని రమణదీక్షితులు అనడంలో వాస్తవం లేదన్నారు.