ఆంధ్రప్రదేశ్‌

స్కూలు నుంచే వ్యాయామ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు ఆనందమయ సూచికలో దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. వ్యాయామ, అక్షరాస్యత, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ప్రాథమిక పాఠశాల నుంచే ప్రతి చిన్నారికి కూడా వ్యాయామ విద్యలో శిక్షణ అందేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. వ్యాయామ విద్యకు అవసరమైన వౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల కల్పనకుగాను విధి విధానాలను రూపొందించటంతో పాటు వార్షిక క్యాలెండర్‌ను రూపొందించేందుకు ఐదుగురు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ సంఘంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, కె.నారాయణ, అయ్యన్నపాత్రుడు సభ్యులుగా వుంటారంటూ సిఎం ప్రకటించారు. స్థానిక ఎ1 కనె్వన్షన్‌లో శనివారం సాయంత్రం జరిగిన వ్యాయామ, అక్షరాస్యత, క్రీడలు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

చిత్రం సమావేశంలో మాట్లాడుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు