ఆంధ్రప్రదేశ్‌

రూ.4,800 కోట్లతో పాఠశాలల్లో వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ), జూన్ 12: విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వౌలికవసతుల కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4,800 కోట్ల కేటాయించిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలల పున:ప్రారంభం సందర్భంగా ‘బడి పిలుస్తోంది’ వారోత్సవాల కార్యాక్రమాన్ని విశాఖ నక్కవానిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఫీజులు ఉండవని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు, నాణ్యతతోకూడిన విద్యా బోధన జరిగేలా క్వాలిఫైడ్ టీచర్లను నియామించామన్నారు. తల్లిదండ్రులంతా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడం ఎంతో శ్రేయస్కరమన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని హంగులతో డిజిటల్ విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నా విద్యకు తగిన ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశ్యంతోనే పూర్తి స్థాయిలో నిధులు కేటాయించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా డీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా గుర్తింపు, అనుమతి లేని పాఠశాలలపై ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది నుంచి రాష్టవ్య్రాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పధకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జూనియర్ కళాశాలల ప్రారంభం నుంచే అమలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాని, అంతేకాకుండా కేజీబీఎస్ పాఠశాల సంఖ్యను మరింత పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 55 జూనియర్ కళాశాలలు, 15 డిగ్రీ కళాశాలలు కొత్తగా మంజూరు చేశామన్నారు. ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, తదితర వాటిని సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మీ, జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి తదితరలు పాల్గొన్నారు.