ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ప్రకాశం యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, జూన్ 12: ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన యువకుడు అమెరికాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ఘటన వివరాలిలావున్నాయి. మృతుని తల్లిదండ్రుల కథనం ప్రకారం పామూరుకు చెందిన వెంకటరావు, రమాదేవి దంపతుల కుమారుడు దీపక్ (26) అమెరికాలో ఎంఎస్సీ పూర్తి చేసి గత కొన్ని రోజులుగా టెక్టాస్ నగరంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. మంగళవారం రైల్వేస్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తండ్రి వెంకటరావు చెప్పారు. దీపక్ మరణవార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కదిరి బాబురావు సహా పలువురు వారింటికి వెళ్లి సంతాపం తెలిపి వెంకటరావు దంపతులను ఓదార్చారు.