ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నీటి అవసరాలపై సర్కారు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నతాధికారుల క్వార్టర్ల నిర్మాణపు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇతర భవనాలకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే సమయంలో రాజధానికి భవిష్యత్‌లో మంచినీటి కష్టాలు ఎదురుకాకుండా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ ఎగువన నూతన నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ.2వేల 169 కోట్ల మేరకు పాలనా అనుమతులు కూడా జారీ చేసింది. ఇక టెండరు పిలువడానికి రాష్ట్ర జలవనరుల శాఖ కసరత్తు ప్రారంభించింది. రవాణాపరంగా ఈ ప్రాంతం కీలకం కావడం.. బ్యారేజీ నిర్మాణానికి సహజ సిద్ధంగా కూడా అనుకూలంగా ఉండటంతో కొత్త బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బ్యారేజీ ఆకృతులు రూపొందించి.. పనులకు టెండర్లు పిలువడానికి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తమ శాఖ ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు. ఈ బ్యారేజీ నిర్మాణమైతే.. 10 టీఎంసీల నీరు నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23కిమీ దూరంలో కంచికచర్ల సమీపంలోని గనిఆత్కూరు-గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురం మధ్య ఈ నూతన బ్యారేజీని నిర్మిస్తే కొన్ని కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గని ఆత్కూరు, గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి గతంలోనే ప్రాథమిక సర్వే పూర్తిచేశారు. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచే పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర విభజనతో నీటి అవసరాల కోసం ఈ ప్రాంతంలో బ్రిడ్జి కమ్ బ్యారేజి నిర్మాణానికి అంతులేని డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రాజధానిలో మంచి నీటి అవసరాలు ఆశించినంతగా లేకపోవడంతో వాటర్ స్టోరేజీకి మరో బ్యారేజి నిర్మాణం అవసరమైంది. సాగర్ నుంచి ఇటీవల కాలంలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతోంది. అదృష్టవశాత్తు గత మొడేళ్లుగా ఖరీఫ్‌లో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టును పట్టిసీమ నీరు ఆదుకుంటోంది. అయితే పులిచింతల దిగువ మునే్నరు, ఇతర వాగుల నుంచి వచ్చే వరద నీటిని తరచుగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను పైకి ఎత్తి వృథాగా సముద్రంలోకి వదలాల్సి వస్తోంది. అందుకే 10 టీఎంసీల నీటి నిల్వ కోసం మరో బ్యారేజీ నిర్మాణం అవసరమైంది. దీనివల్ల 50 లక్షల మందికి మంచినీరు రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లక్ష్యంగా ఈ బ్యారేజీకి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. ఈ బ్యారేజీ నిర్మాణానికి దాదాపు రెండువేల 169 కోట్లు ఖర్చవుతుందనేది ప్రాథమిక అంచనా. నూతన బ్యారేజీ నిర్మాణం జరిగిన వెంటనే 10 టీఎంసీల నీటిని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే వీలుంటుంది.