ఆంధ్రప్రదేశ్‌

మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబాజీపేట, జూన్ 12: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మార్కెట్ యార్డులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో యార్డులో నిల్వవుంచిన కురిడీ కొబ్బరి పెద్ద మొత్తంలో అగ్నికి ఆహుతయ్యింది. నష్టం విలువ సుమారు రూ.1.5 కోట్ల మేర ఉంటుందని అంచనా. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున యార్డులో కురిడీ కొబ్బరి నిల్వవుంచిన రెండో నెంబరు గోదాములో మంటలు చెలరేగాయి. అప్పటికే యార్డుకు చేరుకున్న అరటి రైతులు మంటలను గమనించి గోదాములో ఉన్న కొన్ని బస్తాలను వెలికి తెచ్చి, కాపాడారు. ఈ ప్రమాదంలో అప్పన వెంకట్రాజు అండ్ బ్రదర్స్ సంస్థకు చెందిన అయిదు లక్షల గండేరా కురిడీ కొబ్బరి బుగ్గిపాలైంది. కొబ్బరి బస్తాలతో పాటు గోనె సంచులు ఇతర సామాగ్రి, ఖాతా పుస్తకాలు కాలిపోయాయి. ఈ ప్రమాదం కారణంగా కొబ్బరి వ్యాపారికి రూ.కోటి, మార్కెట్ కమిటీకి రూ.50 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని అంచనా.