ఆంధ్రప్రదేశ్‌

ఆధునిక సాంకేతికతతో పర్యాటక గణన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: సాంప్రదాయ బద్ధమైన పర్యాటక గణనకు ముగింపు పలుకుతూ శాంపిల్ సర్వే విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆలంబనగా పర్యాటక శాటిలైట్ అకౌంటింగ్‌కు రూపకల్పన చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణా సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం అధారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. పర్యాటకుల ఆగమనానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన లెక్కలు లేవని ఆ పరిస్థితిని అధిగమిస్తూ నూతన విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాటిలైట్ అకౌంటింగ్ విధానంపై విజయవాడ పున్నమి ఘాట్ పర్యాటక అతిధి గృహ సముదాయం ఆవరణలో మంగళవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందించాలంటే వారి ఆగమనానికి సంబంధించిన స్పష్టత అవసరమన్నారు. పర్యాటకులు ఏ కాలంలో ఎక్కువగా వస్తున్నారు, వారు ఆంధ్రప్రదేశ్‌లో ఏమి కోరుకుంటున్నారు, పర్యాటకశాఖ నిర్వహణ పరంగా వారు గుర్తించిన లోపాలు ఏమిటి అన్న దానిపై శాంపిల్ సర్వే ద్వారా నిర్దిష్టమైన గణాంకాలు సాధించవచ్చన్నారు.