ఆంధ్రప్రదేశ్‌

మాతా శిశు మరణాలు అరికడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 12: మాతా శిశు మరణాల రేటులో (ఎంఎంఆర్, ఐఎంఆర్) దేశంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను నాలుగేళ్లలో 4వ ర్యాంకుకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేరళను అధిగమించి నెంబర్-1 స్థానం చేరుకోవాలని, ‘0’ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం కోరారు. ఉద్యోగులందరూ తనతోపాటు కష్టపడటంతో నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకురాగలిగినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో, మేలిమి పద్ధతులతో విద్యారంగంలో నెంబర్-1 స్థానం కైవసం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఎఎన్‌ఎంలు, కాంట్రాక్టు కార్మికులు, పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు పెంచినందుకు, పీఆర్‌సీ ఎరియర్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రిని ఉద్యోగులు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సత్కరించారు. తాను రాత్రి నిద్రించే సమయంలో తప్ప రోజంతా కష్టపడతానని, పని చేయటంలో ఆనందం పొందుతానని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రజల ఆరోగ్య భద్రత, మాతా శిశు మరణాల రేటు తగ్గించే బాధ్యతను ఎఎన్‌ఎంలు, ఉద్యోగులు, కార్మికులు చూసుకోవాలని కోరారు. ‘ఈ నాలుగేళ్లుగా మీరెంతో కష్టపడి పనిచేశారు. మీ సేవలకు గుర్తింపుగానే రాష్ట్రంలో 13వేల మంది కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందికి వేతనాలు పెంచాం. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ సేవలను పరిగణనలోకి తీసుకుని, ప్రోత్సాహకంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. ఇలాఉంటే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను శాశ్వత పద్ధతిలో నియమించాలని, వయో భారంతో అందరూ సైకిళ్లు నడపలేరని, స్కూటీలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఎంపీహెచ్‌ఎ పోస్టులు భర్తీ చేయాలని, ఏఎన్‌ఎంలకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేసి ఉపాధి దారి చూపాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రేణుకాదేవి, ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయి ఉద్యోగులు, ఎఎన్‌ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులు 100 మంది ముఖ్యమంత్రిని కలిశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య పాల్గొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం, పీస్ రేట్ రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు నేరుగా చెల్లింపులు చేయాలని కోరుతూ వారు వినతిపత్రం సమర్పించారు.