ఆంధ్రప్రదేశ్‌

ఊగిసలాడిన రోడ్డు కమ్ రైలు వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 12: పశ్చిమ గోదావరి జిల్లా నుండి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు స్వాగతం పలకడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిన గోదావరి నదిపై ఉన్న రోడ్డు కమ్ రైలు వంతెన కొద్దిసేపు అందరినీ కలవరపరచింది. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వారధిగా ఉన్న రోడ్డుకం రైలు వంతెన పాదయాత్రకు తరలివచ్చిన జనంతో నిండిపోవడంతో మధ్యాహ్నం కొద్దిసేపు ఊగిసలాడింది. ఈ వంతెనపై వాహనాలు వెళ్లినపుడు కొద్దిగా ఊగిసలాడటం సాధారణం. అలాంటి సాంకేతికతమే వంతెన నిర్మాణ సమయంలో వినియోగించారు. అయితే ఒక్కసారిగా వేలాది మంది కార్యకర్తలు వంతెనపైకి చేరడంతో మంగళవారం మాత్రం వంతెన ఉయ్యాల మాదిరిగా ఊగింది. దీంతో వంతెనపై ఉన్న వారంతా తీవ్ర ఆందోళన చెందారు. సుమారు పావుగంట పాటు వంతెన ఊగిసలాడింది. వంతెన ఊగడాన్ని కార్యకర్తలంతా స్పష్టంగా గమనించారు. దీంతో వంతెనపై ఉన్నవారిలో కొందరు భయాందోళనలతో పరుగులు తీయడం కనిపించింది. రోడ్డుకంరైలు వంతెన పరిస్థితిపై పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీచేశారు. ఈనేపథ్యంలో పలు ఆంక్షలు కూడా విధించారు. అయినా కార్యకర్తలు వాటిని లెక్క చేయకుండా భారీగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసుల తరం కాలేదు. ఒకదశలో వంతెనపై తొక్కిసలాట జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. కాగా జగన్ పాదయాత్ర నేపథ్యంలో రోడ్డు కం రైలు వంతెన మీదుగా రైళ్ల రాకపోకలను సుమారు 4గంటల పాటు నిలిపివేశారు. వంతెన పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌పైకి కార్యకర్తలు రాకుండా ఆర్పీఎఫ్, పోలీసులు గస్తీ నిర్వహించారు.

చిత్రం..జనంతో కిక్కిరిసిన రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన