ఆంధ్రప్రదేశ్‌

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ), జూన్ 12: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో 2,97,862 మందికి 1,93,541 మంది పాసై 65 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఒకేషనల్ విభాగంలో 11,710 మంది విద్యార్థుల్లో 6,459 మంది పాసై 55 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. సెకిండియర్ జనరల్ విభాగంలో 1,19,575 మందిలో 54,762 మంది పాసై 46 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఒకేషనల్ విభాగంలో 6,617 మంది విద్యార్థుల్లో 3,559 మంది పాసై 54 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫ్రథమ సంవత్సరంలో కృష్ణా జిల్లా తొలి స్థానంలో ఉండగా, కడప చివరి స్థానంలో ఉందన్నారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి నెల్లూరు తొలి స్థానంలో నిలవగా, ప్రకాశం చివరి స్థానంలో ఉందన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మీ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రసాద్‌బాబు, ఏయూ రిజిష్ట్రార్ ఆచార్య ఉమామహేశ్వరరావు, తదితరలు పాల్గొన్నారు.

చిత్రం..ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి గంటా