ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ బలోపేతానికి కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఈ మేరకు నగరానికి చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మంగళవారం పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో సమీక్షలు, సమావేశాలతో మేధోమథనానికి శ్రీకారం చుట్టారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు పీసీసీ, డీసీసీ, నేతలతోపాటు కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు వివిధ అనుబంధ సంఘాల నేతలతో విడి విడిగా సమావేశమైన చాందీ బిజీ బిజీగా గడిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు ప్రారంభించారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్న ఆయన తదుపరి వ్యవహరించాల్సిన తీరు, భవిష్యత్తు ప్రణాళికలను రూపకల్పన చేయడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా అమలు చేసే కూడా విధి విధానాలకు సన్నాహాలు చేస్తున్నారు. సమీక్షలో భాగంగా పలువురు నేతలు పై నుంచి కింది స్థాయి వరకూ వివిధ స్థాయిల్లో ఉన్న నాయకత్వ మార్పుపై పలు సూచనలిచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఏయే అంశాల్లో నష్టపోయిందో, అక్కడే రాజకీయ ప్రయోజనం పొందాలన్న అంశాలను పరిగణలోకి తీసుకుని, పార్టీకి దూరమైన, వీడిన నేతలకు ప్రత్యామ్నాయ నేతల ఎంపిక తోపాటు పార్టీలోకి నూతన శ్రేణులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చలు సాగించారు. 2019లో కేంద్రంలో అధికారం చేపట్టేందుకు రాష్ట్రంలో కొన్ని ఎంపీ స్థానాలనైనా సాధించుకోవాలన్న లక్ష్యంతో ఊమెన్ చాందీకి ఆ దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం దిశానిర్దేశం చేయటంతో నియోజకవర్గ స్థాయిలలో కూడా సమీక్షలు జరిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేయటమే చాందీ జరిపిన సమీక్షల సారాంశంగా భావిస్తున్నారు.
చాందీతో నేతల ముఖాముఖీ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం కోసం అన్ని విధాలుగా చర్యలు ప్రారంభించామని కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విజయవాడలోని పీసీసీ కార్యాలయానికి మొదటిసారిగా మంగళవారం విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో ముఖాముఖి సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీతో కలిసి పల్లంరాజు మాట్లాడారు. తొలుత ఊమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరితో మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను వివరంగా చర్చించారన్నారు. నేతల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారన్నారు. చాందీ లాంటి సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలు సరిదిద్దడానికి రావడం కాంగ్రెస్ పార్టీకి శుభసూచికంగా భావిస్తున్నామన్నారు. అందరితో కూడా చాలా వివరంగా గతంలో జరిగిన విషయాలు, పార్టీ కార్యక్రమాలు, పార్టీ వ్యవస్థ, రాష్ట్రంలోని ముఖ్యఅంశాలు, ప్రత్యర్థి పార్టీ బలాలు, ఇతర విషయాలన్నీ వివరంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలుసుకుంటున్నారన్నారు. ఆయన మనసులో ఉన్న అభిప్రాయాలను కూడా పార్టీ నేతలతో చెబుతున్నారన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీతో కూడా ఉమెన్ చాందీ సమావేశం కానున్నార చెప్పారు.
చిత్రం..విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు
రఘువీరారెడ్డి, ఇతర రాష్ట్ర సీనియర్ నాయకులతో ఊమెన్‌చాందీ