ఆంధ్రప్రదేశ్‌

తగ్గిన మామిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 12: చిత్తూరు జిల్లాలో రోజురోజుకు మామిడి ధరలు పతనవౌతుండంతో రైతుల్లో అందోళన నెలకొంది. సీజన్ ప్రారంభంలో మంచి ధరలు ఉన్నా క్రమేణా ధరలు తగ్గుతూ వస్తుండంతో కనీసం పెట్టు బడులు కూడా దక్కని పరిస్థితి నెలకొనడంతో మామిడి రైతులు ఆయోమయంలో పడ్డారు. మరో పక్క గిట్టు బాటు ధరల కోసం రైతులు ఆందోళన బాటపడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో తూకాలు , కమీషన్‌తో రైతులు దగా పడుతున్నారు. మరో పక్క మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు సిండికేట్ కావడంతో ఆశించిన ధరలు దక్కని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉండటంతో మంచి ధరలు వస్తాయని రైతులు ఆశించారు. అయితే రైతుల పరిస్థితి ఒక్కసారిగా మారి పోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలో ప్రధాన వాణిజ్యపంట మామిడి పంటను బావులు, బోర్లుతో వచ్చేనీటితో సాగు చేసుకున్నారు.
ఉపాధి హామి పథకం ద్వారా ఈ పంట సాగుకు పలు రాయితీలు కల్పించడంతో జిల్లాలో క్రమేణా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పంటకు అనుకూలంగా లేక పోవడంతో పంట దిగుబడులు తగ్గాయి. దీంతో మంచి ధరలు వచ్చి తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించినా రైతులకు ఈఏడాది కూడా చేదు అనుభవానే్న మిగిల్చింది. గతంలో ఇక్కడ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, తమళనాడు రాష్ట్రానికి మామిడి ఎగుమతులు అయ్యేవి. ఆ కారణంగా రైతుకు కొంతమేర గిట్టుబాటు ధరలు దక్కేవి, ఈ ఏడాది తమిళనాడుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒకేసారి సీజన్ ప్రారంభం కావడంతో దీని ప్రభావం ధరలపై పడింది. ఎగుమతులు తగ్గి డిమాండ్ లేక పోవడంతో క్రమేణా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ప్రసుత్తం ఓకే సారి పంట దిగుబడి రావడం ధరలు లేక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడికి గిట్టు బాటు ధరలు కల్పించాలని రైతులు ఆందోళనలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 80వేల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.