ఆంధ్రప్రదేశ్‌

సప్లిమెంటరీ అభ్యర్థులకు నేడు ఎంసెట్ ర్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 14 జేఎన్‌టియూకే నిర్వహించిన ఏపీ ఎంసెట్-2018కి సంబంధించి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ర్యాంకులను శుక్రవారం వర్సిటీ ప్రకటించనుంది. ఈ సంవత్సరం ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో ఉత్తీర్ణులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 5137 మంది అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించారు. అలాగే మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాలకు గాను 1600మంది అభ్యర్థులకు ర్యాంకులు కేటాయించినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు గురువారం తెలిపారు. ఎంసెట్ ఫలితాల్లో అర్హత పొంది, ఇంటర్ ఫెయిలైన వారు తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అనంతరం వారి మార్కుల జాబితాలను వర్సిటీకి సమర్పించారన్నారు. వారి ఇంటర్ మార్కులను వెయిటేజీగా తీసుకున్న పిమ్మట ర్యాంకులను కేటాయించామన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ విభాగాల్లో మొత్తం 6737 మంది విద్యార్థులకు ర్యాంకులను కేటాయించామన్నారు. అభ్యర్థులు ఎంసెట్ దరఖాస్తుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్లకు శుక్రవారం సాయంత్రం ర్యాంకులను సంక్షిప్త సందేశం ద్వారా పంపిస్తామని పేర్కొన్నారు. అదే సమయంలో ర్యాంకు కార్డులను ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ కాకుండా వేరే బోర్డుల నుండి ఎంసెట్‌కు హాజరై, ఇంతవరకు ర్యాంకులు పొందని అభ్యర్థులు వెంటనే ఇంటరు మార్కుల జాబితాలను అందజేయాలన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు సహా ఆయా బోర్డులు జారీ చేసిన మార్కులను పరిశీలించి, వాటిని వెయిటేజీగా తీసుకుని అభ్యర్ధులకు ఎంసెట్ ర్యాంకులను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం కౌనె్సలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన మిగిలిన వారికి ర్యాంకులు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు సకాలంలో మార్కుల జాబితాలను అందజేసి, ర్యాంకులు పొందాలని కోరారు. ఎంసెట్‌పై సందేహాల నివృత్తికి కాకినాడ జేఎన్‌టియూలోని ఎంసెట్ ప్రధాన కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సెల్‌లో నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. ఏ విధమైన సమస్యలున్నా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 0884-2340535, 0884-2356255 ఫోన్ నంబర్లకూ సంప్రదించాలని డాక్టర్ సాయిబాబు విజ్ఞప్తి చేశారు.